ఖమ్మంలో ఉద్యమకారుడు లెక్చరర్ నయీమ్ సార్‌కు ఘన నివాళి

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఖమ్మం

జూనియర్ డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసిన నయీమ్ సార్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఖమ్మం నగరంలో ఆయనకు పలువురు నాయకులు ఘన నివాళులర్పించారు. విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో పనిచేస్తూ విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన ఆయన, మిలిటెంట్ పోరామాల్లో కీలక పాత్ర పోషించారని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.