రవితేజ కుటుంబ హీరో నటించిన మారేమ్మ ఓటీటీ విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు నటించిన మారేమ్మ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రూరల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయిన ఈ సినిమా, అక్టోబర్ 9 నుంచి ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.