సంగీత్ చిత్రం నుంచి నీ వల్లే మొదటి పాట విడుదల చేసిన ఏఆర్ రెహమాన్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిఖిల్ విజయేంద్ర సింహ హీరోగా, తేజు అశ్విని హీరోయిన్ గా సాద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగీత్ చిత్రం నుంచి నీ వల్లే అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ మొదటి పాటను ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ శనివారం తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అచు రాజమణి సంగీతం అందించిన ఈ పాటకు సిద్ శ్రీరామ్ ఆలపించగా, విక్రమ్ శివ సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రావంతి నవీన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.