రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ మరియు చైనా దేశాలకు అమెరికా హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: అమెరికా
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్ మరియు చైనా దేశాలపై సుంకాలు విధించేందుకు వీలుగా రూపొందించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ చట్టం-2026 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లుకు సభ ఆమోదం తెలపడంతో, రష్యా మరియు ఇరాన్‌లపై ఆంక్షలు విధించేందుకు, వాటితో వాణిజ్యం సాగిస్తున్న దేశాలపై చర్యలు తీసుకునేందుకు అమెరికాకు పూర్తి అధికారాలు లభించాయి.