భక్తిశ్రద్ధలతో ముగిసిన గణేశుని నాల్గవ రోజు ప్రత్యేక పూజలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో కొలువుదీరిన వినాయకునికి నాల్గవ రోజు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో నవకోటి మజందర్ బాబు కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.