కోసమాగూడలో తాగునీటి సమస్య పరిష్కారం: నిధులు మంజూరు చేసిన అధికారులు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: ముంచింగిపుట్టు

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ పరిధిలోని కోసమాగూడ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు రూ. రెండు లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో తాగునీటి శుద్ధి మరియు సరఫరా పనులను స్థానిక మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో తక్షణమే ప్రారంభించారు. తాగునీటి ఇబ్బందులు తొలగిపోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.