విజయవాడలో అక్టోబర్ 8 నుంచి జాతీయ స్థాయి సరస్ మేళా

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయవాడ

మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వేదికగా అక్టోబర్ 8 నుంచి 22 వరకు జాతీయ సరస్ మేళా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. విజయవాడ కలెక్టరేట్లో మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేళాలో దేశవ్యాప్తంగా సుమారు 350 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయని, దసరా ఉత్సవాల స్థాయిలో దీనిని విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.