యూట్యూబర్ ప్రశ్న రావణ్ పోలీస్ కస్టడీకి గన్నవరం కోర్టు అనుమతి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: గన్నవరం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు మరియు హిందూ దేవుళ్లను కించపరిచిన ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ గన్నవరం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.