ఓటీటీలోకి తమిళ స్పోర్ట్స్ డ్రామా అంగీకారం
రిపోర్టర్: రాజేష్
స్థలం: చెన్నై
తమిళంలో ప్రశంసలు పొందిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం అంగీకారం త్వరలో డిజిటల్ వేదికపై విడుదల కానుంది. కోటపాడి జె రాజేష్ హీరోగా నటించి నిర్మించిన ఈ చిత్రానికి తెన్పాతియన్ దర్శకత్వం వహించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25 నుండి సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. అథ్లెట్ అయిన ఆతిరన్ తన క్రీడా కెరీర్ కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు, న్యాయ పోరాటం ఈ చిత్రంలో ప్రధానాంశంగా చూపించారు.