ఎన్నికల రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న కలెక్టర్ హిమాన్షు
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనలను ప్రచారం చేసుకునే ముందు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మరియు సోషల్ మీడియాలో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలను పర్యవేక్షించడంతో పాటు పెయిడ్ న్యూస్‌పై కూడా ఎంసీఎంసీ నిఘా ఉంచుతుందని పేర్కొంటూ నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.