ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర కలకలం: కోపైలట్ దాడిలో భారతీయ కెప్టెన్కు గాయాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: తబూక్

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ జరిపిన దాడిలో భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బోయింగ్ విమానంలో కాక్పిట్లోనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ కెప్టెన్ ధైర్యంగా తలుపు తెరిచి ప్రయాణికుల సాయంతో నిందితుడిని అడ్డుకున్నారని, విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబూక్లో ల్యాండ్ అయిందని వెల్లడించారు.