ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలులో ఏఐ కంటే నాణ్యతకే భారతీయుల ప్రాధాన్యత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
ఇంటి అవసరాల కోసం ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో భారతీయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే నాణ్యత, విద్యుత్ ఆదా, పనితీరు, మన్నిక, సర్వీస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అమెజాన్ ఇండియా లేటెస్ట్ బెస్ట్ ఇన్ టెక్ సర్వే వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో 40 వేలకు పైగా మంది ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఈ వివరాలను అమెజాన్ స్పష్టం చేసింది.