బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో తుపాను ముప్పుతో విస్తారంగా వర్షాలు
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా మారనుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల ఇరవై ఆరో తేదీకి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.