వారణాసి సినిమా కేవలం టైమ్ ట్రావెల్ కాదు: పృథ్వీరాజ్
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు - ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ మూవీలో నెగిటివ్ రోల్ చేస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా సినిమా కథపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం సాధారణ టైమ్ ట్రావెల్ స్టోరీ కాదని, అంతకు మించి అత్యంత విభిన్నంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.