ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్ఐ నాగేంద్ర

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రాంబిల్లి

రాంబిల్లి మండలంలో వడనారదాపురంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో ఎస్ఐ నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అపరిచిత లింకులు, ఫోన్కాల్స్, మెసేజ్లను నమ్మవద్దని సూచించారు.