కన్నడ నటుడు కిరణ్ రాజ్ ప్రతిభ: ఐదోసారి ఉత్తమ నటుడిగా అవార్డు కైవసం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: బెంగళూరు

కన్నడ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు కిరణ్ రాజ్ మరో అరుదైన ఘనత సాధించారని, కర్ణ సీరియల్ లో ప్రతిభావంతమైన నటనకు గాను ఆయన ఐదోసారి ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. కన్నడ వినోద పరిశ్రమలో టీఆర్పీ కింగ్గా పిలువబడే ఆయన, డాక్టర్ కర్ణ పాత్రలో తన భావోద్వేగ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని, ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ద్వారా తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.