భీమిలి కేజీబీవీ వసతిగృహంలో పది మంది విద్యార్థినుల జడలు కత్తిరింపు

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా భీమిలి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం వసతిగృహంలో పదవ తరగతికి చెందిన పది మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 16న రాత్రి రెండు గదుల్లో నిద్రపోయిన 38 మందిలో 10 మంది జడలు ఉదయానికి కత్తిరించి ఉండటాన్ని గుర్తించారు. వసతిగృహంలో కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో తోటి విద్యార్థినులే ఈ ఆకతాయితనానికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.