వృత్తి విద్యా కోర్సుల్లో గ్రామీణ విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్

రిపోర్టర్: విజయ్ స్థలం: కర్ణాటక

కర్ణాటకలో వృత్తి విద్యా కోర్సుల ప్రభుత్వ సీట్లలో గ్రామీణ విద్యార్థులకు 15 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి 7.5 శాతం, మిగతా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరో 7.5 శాతం కోటాను విభజించారు. దీనిపై అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తున్నారు.