నమీబియాపై సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా

రిపోర్టర్: గోపి స్థలం: World

నమీబియాతో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 156 పరుగులకే కుప్పకూలగా, బ్జోర్న్ ఫోర్టుయిన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం జోర్డాన్ హెర్మన్, కొనర్ ఎస్టర్‌హుయిజెన్ రాణించడంతో సౌతాఫ్రికా సులభంగా లక్ష్యాన్ని చేధించింది.