గాజువాకలో దొరికిన మూగ పాప.. పోలీసులకు అప్పగించిన స్థానికులు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
గాజువాక 87వ వార్డు పరిధిలో గుర్తు తెలియని మూగ పాప కనిపించింది. పాప తన వివరాలు చెప్పలేని స్థితిలో ఉండటంతో, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను దువ్వాడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రస్తుతం పాప పోలీసుల సంరక్షణలో ఉంది. పాప వివరాలు తెలిసిన వారు కూర్మన్నపాలెం వద్ద ఉన్న దువ్వాడ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. చిన్నారిని గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.