సింగారం గ్రామంలో ముమ్మరంగా ప్రారంభమైన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం సింగారం గ్రామంలో మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈద్దల వెంకటయ్య ఇంటి నుంచి జోగు కనకయ్య ఇల్లు, అలాగే జోగు కనకయ్య ఇంటి నుంచి మన్నె రాములు ఇల్లు వరకు ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ ప్రమీల పండరి, ఉప సర్పంచ్ కరుణాకర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు మరియు నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.