హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ వాసులకు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. నగరంలోని ఈస్ట్, సౌత్, సెంట్రల్ ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే నాగోల్లో భారీ వర్షం కురుస్తుండగా, వినాయక నిమజ్జనాలకు వెళ్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, బోయిగూడ ప్రాంతాల్లోనూ జల్లులు కురిశాయి.