అమెరికాలో వైభవంగా బతుకమ్మ సంబరాలు: ముప్పై వేల మందితో కళకళలాడిన న్యూజెర్సీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూజెర్సీ
అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ వేడుకలకు ముప్పై వేల మందికి పైగా తెలుగు ప్రజలు తరలివచ్చారు. పదిహేను అడుగుల భారీ బతుకమ్మ ఆవిష్కరణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రవాస భారతీయులు సంప్రదాయ దుస్తుల్లో పెద్ద ఎత్తున హాజరై తెలంగాణ సంస్కృతిని చాటుకున్నారు.