పర్యావరణ రక్షణ అందరి బాధ్యతని స్పష్టం చేసిన అటవీ శాఖాధికారి

రిపోర్టర్: Nelluri Chiranjeevi స్థలం: గొలుగొండ

బ్రిక్స్ వారోత్సవాలలో భాగంగా గొలుగొండ పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటిని పొదుపు చేయాలని కేడీపేట రేంజ్ అధికారి శ్రీనివాసరావు సూచించారు. చెట్లు ప్రాణవాయువు అందిస్తూ వర్షాలు కురిసేలా చేస్తాయని ఆయన వివరించారు.