విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమా కథాంశం లీక్
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రం 'రణబాలి'. 1876-1878 నాటి మద్రాస్ కరవు, రాయలసీమ ప్రాంత తిరుగుబాట్ల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా విజయ్, ఆయన భార్య జయమ్మగా రష్మిక మందన్న నటిస్తున్నారు. చారిత్రక మూలాలు, భారీ యాక్షన్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచుతోంది.