'గిరిజన రిజర్వేషన్ల పెంపునకు నాలుగేళ్ళు': కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమానికి బాటలు వేసిన మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR చిత్రపటానికి విద్యార్థులు, నేతలు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ తో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.