వినాయక నిమజ్జన వేడుకల్లో రాజకీయ పాటలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
వినాయక నిమజ్జన వేడుకల్లో రాజకీయ పార్టీల పాటలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారి సోషల్ మీడియా ఖాతాలను గుర్తిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మతపరమైన వేడుకల్లో రాజకీయ జోక్యం తగదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.