పల్నాడు జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లలో చోరీల ముఠా అరెస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: పల్నాడు

తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులతో పాటు ఒక రిసీవర్ను అరెస్ట్ చేసినట్లు పల్నాడు పోలీస్ వెల్లడించారు. ఈ మేరకు ఎడ్లపాడు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు వందల అరెస్టు గ్రాముల బంగారు ఆభరణాలు, అయిదు కిలోల తొమ్మిది వందల గ్రాముల వెండి ఆభరణాలతో పాటు లక్షా రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.