ఎల్ నినో ప్రభావంతో తాగునీటికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే వేసవిలో నీటి కొరత తలెత్తకుండా తాగునీటికే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న జల వనరులను పొదుపుగా వాడుతామని వెల్లడించారు. ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1.81 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అనాలోచిత విధానాల వల్లే కూలిపోయిందని తీవ్రంగా విమర్శించారు.