టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: నవంబర్ 5న మోటోరోలా సిగ్నేచర్ 27 లాంచ్

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తన సరికొత్త ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ మోటోరోలా సిగ్నేచర్ 27 ప్రపంచ లాంచ్ కు సిద్ధమవుతోందని టెక్ నిపుణులు తెలిపారు. నవంబర్ 5వ తేదీన ఈ మొబైల్ మార్కెట్లోకి రానుందని వెల్లడించారు. లాంచ్ కు ముందే ఆన్లైన్ లో హ్యాండ్-ఆన్ వీడియో లీకైందని, దీని ద్వారా డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్ వంటి పలు కీలక హార్డ్వేర్ వివరాలు బయటపడ్డాయని టెక్ వర్గాలు పేర్కొన్నాయి.