ఇతరుల ఐడీలతో సిమ్ కార్డులు తీసుకుంటే భారీ జరిమానా
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
ఇతరుల గుర్తింపు పత్రాలను అనధికారికంగా ఉపయోగించి సిమ్ కార్డులు తీసుకునే వారికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఒక పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్ స్థానికుల ప్రమేయం లేకుండా 25 సిమ్‌లను అక్రమంగా యాక్టివేట్ చేసిన ఉదంతం వెలుగుచూడటంతో డీఓటీ ఈ కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు యాభై లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.