నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి అత్యాధునిక క్యాథ్ల్యాబ్ మంజూరు చేసిన ప్రభుత్వం

రిపోర్టర్: సునీల్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి కూటమి ప్రభుత్వం అధునాతన పరిజ్ఞానంతో కూడిన క్యాథ్ల్యాబ్ను మంజూరు చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.మాధవి తెలిపారు. ఈ నిర్ణయంతో రూ.లక్షలు ఖరీదు చేసే కార్డియాలజీ సేవలు పేద రోగులకు జీజీహెచ్లో ఉచితంగా అందనున్నాయని చెప్పారు. ఇప్పటికే ఆసుపత్రిలో పలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతుండగా, తాజా మంజూరుతో గుండె సంబంధిత వైద్యం మరింత మెరుగుపడుతుందని, చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆమె వెల్లడించారు.