కరెంట్ కోతలపై రేవంత్ సర్కార్ను నిలదీస్తామన్న కొప్పుల ఈశ్వర్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సింగరేణి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ప్రభుత్వం సింగరేణికి రూ. 60 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతోనే సంస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ వైఫల్యాన్ని ప్రజల్లో ఎండగడతామని ఆయన హెచ్చరించారు. అప్రకటిత కోతలతో సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.