HRCI సౌత్ ఇండియా సెక్రటరీగా భోగవిల్లి వెంకట రమణ నియామకం

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరానికి చెందిన భోగవిల్లి వెంకట రమణను 'హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా' (HRCI) సౌత్ ఇండియా సెక్రటరీగా ఫౌండర్, చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ నియమించారు. ఈ మేరకు ఆయన నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల పట్ల వెంకట రమణకున్న అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా, నైతిక విలువలతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.