అనంతపురంలో కూటమి మేయర్ పీఠం చేజారడానికి కారణాలపై తీవ్ర చర్చ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్ లో కూటమి ఓటమి స్వయంకృతమేనని విశ్లేషకులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలు ప్రభంజనం సృష్టించినా, అనంతపురంలో మేయర్ పీఠాన్ని వైకాపా అభ్యర్థి రమేష్ గౌడ్ కైవసం చేసుకున్నారు. పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన స్థానంలో సరైన అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం, దిగువ స్థాయిలో సమన్వయం కొరవడటం వల్లే ఈ పరాజయం చవిచూడాల్సి వచ్చిందని స్థానిక నేతలు మండిపడుతున్నారు.