ఐఫోన్ పద్దెనిమిది ప్రో సిరీస్ లో రీబూటింగ్ సమస్య

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

ఆపిల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ పద్దెనిమిది ప్రో సిరీస్ స్మార్ట్ఫోన్లలో ఫేస్ ఐడీ అన్లాకింగ్ విఫలమైనప్పుడు ఫోన్లు ఫ్రీజ్ అవుతున్నాయని మరియు ఆటోమేటిక్గా రీబూట్ అవుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సాంకేతిక లోపంపై ఆపిల్ సంస్థ అధికారికంగా స్పందించింది. ఈ బగ్ను పరిష్కరించేందుకు త్వరలోనే కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు ఆపిల్ టెక్ దిగ్గజం వెల్లడించిందని టెక్ నిపుణులు పేర్కొన్నారు.