థియేటర్లలో విజయవంతంగా మయూఖ సినిమా ఇరవై ఐదు రోజుల ప్రదర్శన పూర్తి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ సినిమా థియేటర్లలో ఇరవై ఐదు రోజులు విజయవంతంగా ప్రదర్శితమైందని దర్శకుడు శ్రీతేజ్ ఎస్.కె. తెలిపారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన తమ చిత్రాన్ని ప్రేక్షకులు గుండెల్లోకి ఎక్కించుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు మరియు రాజకీయ నేత చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.