శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ భక్తుల హర్షం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh / Telangana
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడం తమ జన్మ ధన్యమైందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో దర్శనం, అన్నప్రసాదం, విద్యుత్ దీపాల అలంకరణలు మరియు భక్తుల సౌకర్యార్థం కల్పించిన ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని కొనియాడారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారని పేర్కొన్నారు. స్వామివారి సేవలో పాల్గొనడం ఎంతో మనశ్శాంతిని ఇచ్చిందని, తిరుమలలో పవిత్ర వాతావరణం నెలకొందని భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.