హైవేపై హృదయాలను హత్తుకున్న దృశ్యం: బైక్పై తల్లిని కూర్చోబెట్టి తీసుకెళ్తున్న కుమారుడు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

తల్లిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతూ ఓ కుమారుడు బైక్పై ఆమెను ఎక్కించుకుని ప్రయాణిస్తున్న అరుదైన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి సమీపంలో వెలుగు చూసింది. మోటార్ సైకిల్కు వెనుక వైపు ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేసి వృద్ధురాలైన తల్లిని కూర్చోబెట్టి ఆమె పడిపోకుండా రక్షణగా కర్రలు కట్టారు. ఈ హృద్యమైన దృశ్యాన్ని ప్రయాణికులు ఆసక్తిగా తిలకించగా, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతోంది.