గ్రూప్ వన్ జవాబుపత్రాల మూల్యాంకన అక్రమాల అప్పీళ్లపై హైకోర్టు తుది విచారణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాకనంలో అక్రమాలపై దాఖలైన అప్పీళ్లపై ఏపీ హైకోర్టు తుది విచారణ ప్రారంభించింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సిట్ నివేదిక అభ్యర్థులకు అనుకూలంగా ఉందని తెలిపారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల మార్కులలో తేడాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.