వైవిధ్యమైన కథతో వస్తున్న 'హ్యాపీ జర్నీ' ట్రైలర్ విడుదల

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ జర్నీ' సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన ఏడుగురు స్త్రీల బంధాల విలువను చాటేలా ఈ చిత్రం రూపొందిందని, సినిమా పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.