వైట్ హౌస్ వద్ద డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురైన చేదు అనుభవం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Washington
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వెలుపల మీడియా సమావేశం ముగించుకుని వెళుతుండగా ఓ విలేకరి అడిగిన ఘాటు ప్రశ్నకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఓటమిపాలై కాంగ్రెస్ నియంత్రణ కోల్పోయిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓటమి అనుభూతి ఎలా ఉందంటూ విలేకరి సంధించిన ప్రశ్నకు ట్రంప్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా హెలిపాడ్ వైపు మౌనంగా వెళ్లిపోయారు.