పర్యావరణ రక్షణకు సరికొత్త బాట: ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

గ్రామీణ ప్రాంతాల్ లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు మరియు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలని పర్యావరణ నిపుణులు పిలుపునిచ్చారు. పెళ్లిళ్లు, పండుగలు, సామూహిక వేడుకల్ లో ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ పాత్రల వల్ల నేల, నీరు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామూహికంగా పాత్రలు సమకూర్చుకునే ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలకు శాశ్వత చెక్ పెట్టవచ్చని నిపుణులు స్పష్టం చేశారు.