బొబ్బిలిలో నిల్వలు లేక సన్న బియ్యం కేంద్రం మూసివేత

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

బొబ్బిలిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్న బియ్యం విక్రయ కేంద్రం నిల్వలు నిండుకోవడంతో మూతపడింది. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే బేబినాయన దీన్ని ప్రారంభించగా, 960 మందికి 113 క్వింటాళ్లు విక్రయించారు. స్టాక్ పూర్తిగా అయిపోవడంతో కేంద్రం తెరుచుకోకపోవడంపై సామాన్య ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.