పశ్చిమాసియా యుద్ధ వాతావరణంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పాకిస్థాన్
పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసింది. సౌదీ అరేబియా, యూఏఈ నుంచి హార్ముజ్ జలసంధి గుండా సాగే చమురు దిగుమతులు నిలిచిపోవడంతో పాకిస్థాన్లో ఇంధన కొరత ఏర్పడి, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం ఈ పరిణామాలతో పూర్తిస్థాయి దివాళా అంచుకు చేరుకుంది.