దివ్యాంగుడైన విద్యార్థి చదువుకు నిరంతరం సాయం అందిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

రిపోర్టర్: రాజేష్ స్థలం: పశ్చిమ గోదావరి

యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చేగొండి భరత్ మూడేళ్ల క్రితం తన తల్లితో వచ్చి కాలేజీ డిగ్రీ ఫీజు, పరీక్ష ఫీజుకు సహాయం చేయమని కోరగా, అప్పటి నుంచి వరుసగా ఫీజులు చెల్లిస్తూ అతనికి అండగా నిలుస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. భరత్ చదువుకు సాయం చేయడం తనకెంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న వైనాన్ని మంత్రి సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.