ఎపిక్ సినిమా చూసి భావోద్వేగానికి గురైన విజయ్, రశ్మిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' చిత్రాన్ని హైదరాబాద్‌లో వీక్షించారు విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న. తండ్రీ కొడుకు మధ్య వచ్చే ఫోన్ కాల్ సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని విజయ్ తెలిపారు. సినిమా ఎంతో రియలిస్టిక్‌గా ఉందని, తల్లిదండ్రుల భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారని రశ్మిక ప్రశంసించారు.