కడుపునొప్పి అని చెప్పి ట్రిప్ కి వెళ్లి సోషల్ మీడియాలో దొరికిపోయిన ఉద్యోగి

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

కడుపునొప్పి అని చెప్పి ఆఫీసుకు సెలవు పెట్టి కూర్గ్ ట్రిప్ కి వెళ్లిన ఓ ఉద్యోగి సోషల్ మీడియా పుణ్యమా అని మేనేజర్ కి దొరికిపోయిన వైనం నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రీల్ లో ఈ ఉద్యోగి డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత మేనేజర్ దీనిని పంపి ఎద్దేవా చేయడంతో ఉద్యోగి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు రెడ్ డిట్ ద్వారా వెల్లడైంది.