పలాస మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరుగులు పెట్టిస్తున్న అధికారులు
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. పలాస ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో అధికారులు అరవై ఏడు పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రత్యేక వాహనాల్లో సిబ్బందిని తరలించనున్నారు. ఆదివారం పోలింగ్ జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.