స్నేహితుడిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగaram
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో మద్యం మత్తులో జరిగిన గొడవలో ఉత్తరావల్లి సంతోష్ కుమార్ అనే యువకుడిని అతని స్నేహితుడు అల్లాడ పైడిరాజు చెక్కతో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ హత్యను రహదారి ప్రమాదంగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించగా, సాక్షి ఇచ్చిన వీడియో ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.